విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కష్టాలపై స్పందించిన మంత్రి కేటీఆర్

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కష్టాలపై స్పందించిన మంత్రి కేటీఆర్
x
KTR (file photo)
Highlights

మలేషియాలోని కౌలాలంపూర్, ఫిలిప్పైన్స్ లోని మనీలా‌, ఇటలీలోని రోమ్ ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న పలువురు భారతీయులు అందులో తెలుగువారిని సురక్షితంగా...

మలేషియాలోని కౌలాలంపూర్, ఫిలిప్పైన్స్ లోని మనీలా‌, ఇటలీలోని రోమ్ ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న పలువురు భారతీయులు అందులో తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలంటూ.. మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. విదేశాంగ మంత్రి జయశంకర్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి గారికి ట్విట్టర్ లో మంత్రి విజ్ఞప్తి చేశారు. అక్కడి విద్యార్థుల యోగ క్షేమాల కోసం విచారించాలని.. వారిని వెంటనే స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభించాలని.. కోరారు.

మరోవైపు ఫిలిప్పీన్స్ లోని మనీలా ఎయిర్‌పోర్ట్‌లో సుమారు 100 మంది వైద్య విద్యార్థులు చిక్కుకుపోయారు. విమానాలు రద్దు చేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు.. మరో 72 గంటల్లో ఎయిర్ పోర్టును మూసేస్తామని.. ప్రకటించారు. దీంతో వెనక్కి వెళ్లలేక, స్వదేశానికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories