ఈ రోజు మరపురాని రోజు : మంత్రి హరీశ్ రావు

ఈ రోజు మరపురాని రోజు : మంత్రి హరీశ్ రావు
x
Highlights

సిద్ది పేటజిల్లాలో గతవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టును మంత్రి హరీశ్ రావు, మంత్రి కేటీఆర్ లు ప్రారంభించిన విషయం తెలిసిందే.

సిద్ది పేటజిల్లాలో గతవారం రంగనాయక సాగర్ ప్రాజెక్టును మంత్రి హరీశ్ రావు, మంత్రి కేటీఆర్ లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చరిత్రలో ఈ రోజును మరచిపోనని, ఇది మరపురాని రోజుని ఆయన అన్నారు. కాలువల వెంట గోదారమ్మ బిరబిరా పరుగులిడుతూ తమ పంటపోలాల్లో చేరుతూ కరువును పోగొడుతుంటే రైతుల ఆనందం చెప్పలేనిదన్నారు.

కుడి కాలువ ద్వారా 40 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగు అవుతుందన్నారు. ఏడాదంతా రంగనాయక సాగర్‌కి నీళ్లు వస్తాయి కాబట్టి కరువును శాశ్వతంగా పారదోలొచ్చన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క రైతు ఈ ఘట్టం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూశారన్నారు. ఈ గోదారి జలాలతో రైతులు సుభిక్షంగా పంటలు పండించి ఆనందంగా ఉండాలని కోరారు. ఇప్పటి వరకు రైతులు కరెంటు మీద ఆధారపడి, బోరు నీటితో పంటను సాగు చేసే వారని, ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజా, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, భూపతి రెడ్డి, అధికారులు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories