దించిన తల ఎత్తకుండా చదవండి.. లేకుంటే బాపుతో బాయికాడికి పోండి..

దించిన తల ఎత్తకుండా చదవండి..  లేకుంటే బాపుతో బాయికాడికి పోండి..
x
Highlights

ఒకప్పుడు తాగడానికి నీళ్లు కావాలని బిందెలు అడ్డం పెట్టిన విఠలాపూర్‌లో ఇవాళ ఇంత మండుటెండల్లో అంతకమ్మ కుంట మత్తడి దూంకుతోందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఒకప్పుడు తాగడానికి నీళ్లు కావాలని బిందెలు అడ్డం పెట్టిన విఠలాపూర్‌లో ఇవాళ ఇంత మండుటెండల్లో అంతకమ్మ కుంట మత్తడి దూంకుతోందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ గ్రామంలోని మాంకాలమ్మ, పెద్దమ్మ, మాతమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాలకు ఆవుపాలతో క్షీరాభిషేకం, గోదావరి జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం జలాలతో నిండిన ఆనంతమ్మ కుంట మత్తడి దూకడంతో గంగమ్మ తల్లికి జల హారతి పట్టి మంత్రి ప్రత్యేక పూజలు చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ గ్రామాల్లో చెరువులు నిండడం చూడలేదని, ఇక మీదట చూడరని అన్నారు. చెరువులు నిండడంతో గ్రామస్తులు సంబుర పడుతున్నారని, విఠలాపూర్ గ్రామస్తులందరి కళ్లలో సంతోషం చూస్తున్నామని ఆయన అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కుంటలు, చెక్ డ్యాములు, చెరువులు నింపుతామని మంత్రి స్పష్టం చేశారు. మీ ముఖాల్లో చిరునవ్వు చూసి తృప్తిగా కడుపు నిండా భోజనం చేసినట్లు ఉందని మంత్రి చెప్పారు.

అనంతరం గ్రామంలోని యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ కాళ్లకు మట్టి అంటకుండా గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం నా బాధ్యత. నేను చేయిస్తా.. కానీ గ్రామ యువత బాగా చదివి మంచి ఉద్యోగం పొందాలి. లేకుంటే.. అమ్మ, బాపుతో కలిసి బాయికాడికి పోయి కమర్షియల్ పంటలను పండించి మంచి లాభాలు గడించాలని యువతకు సందేశం ఇచ్చారు. సన్న రకం వడ్లు, అల్లం, మిర్చి, కూరగాయల పంటలు పండించాలని యువతకు పిలుపునిచ్చారు.

కరోనా కష్టకాలంలో కూడా విఠలాపూర్‌లో 7643 క్వింటాళ్ల ధాన్యం పండిందని, రూ.1.35 కోట్లు ధాన్యం కొనుగోళ్లు జరిగాయని మంత్రి వెల్లడించారు. గోదాముకు రూ.5 కోట్లు, కుంట కట్ట బలోపేతానికి మరమ్మత్తుకు రూ.1.38 కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories