ప్రైవేట్ హాస్పిటల్స్‌తో ఈటల చర్చలు సఫలం

ప్రైవేట్ హాస్పిటల్స్‌తో ఈటల చర్చలు సఫలం
x
Highlights

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌తో మంత్రి ఈటల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో ఆరోగ్యశ్రీ సమ్మెను విరమించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోషియేషన్ అంగీకరించింది.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌తో మంత్రి ఈటల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో ఆరోగ్యశ్రీ సమ్మెను విరమించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోషియేషన్ అంగీకరించింది. నిన్నటివరకు 360కోట్ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం.... మరో వందకోట్లు చెల్లించేందుకు సర్కారు హామీ ఇచ్చింది. అలాగే మూడ్రోజుల్లో మరో 60కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు త్వరలో కమిటీ వేస్తామని మంత్రి ఈటెల హామీ ఇవ్వడంతో... ప్రైవేట్ హాస్పిటల్స్ అసోషియేషన్ సమ్మె విరమణకు ఒప్పుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గొప్పగా అమలవుతోందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 85లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కంటే... తెలంగాణ ఆరోగ్యశ్రీ వంద రెట్లు బాగా అమలవుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ కేవలం 25లక్షల కుటుంబాలకు అమలుచేస్తుంటే.... తెలంగాణలో ఆరోగ్యశ్రీ 85లక్షల ఫ్యామిలీలకు అందిస్తున్నట్లు ఈటల అన్నారు. ఇప్పటివరకు 520కోట్లు చెల్లించామని, త్వరలో ప్రతినెలా కొంతమేర చెల్లించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories