తెలంగాణలో ప్రతిపక్ష హోదా కోరుతున్న ఎంఐఎం

తెలంగాణలో ప్రతిపక్ష హోదా కోరుతున్న ఎంఐఎం
x
Highlights

తెలంగాణలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఎంఐఎం కోరుతోంది. టీఆరెస్ లో విలీనం తరువాత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లో బలం కోల్పోయింది. ఈ నేపథ్యం లో...

తెలంగాణలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఎంఐఎం కోరుతోంది. టీఆరెస్ లో విలీనం తరువాత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లో బలం కోల్పోయింది. ఈ నేపథ్యం లో కాంగ్రెస్ కంటే తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల బలం ఉందనీ, తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలనీ ఎంఐఎం డిమాండ్ చేస్తోంది.

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం నేపథ్యంలో, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోయింది. ఈ నేపథ్యంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం ఉందని... ఈ నేపథ్యంలో, తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని స్పీకర్ ను కోరనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్ ను కలుస్తామని... సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అసదుద్దీన్ ఒవైసీ లిపారు. గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అయన అన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories