నూతన సదుపాయాలతో మెట్రో..

నూతన సదుపాయాలతో మెట్రో..
x
మెట్రో
Highlights

చాలామంది ప్రయాణికులు తమ ప్రయాణ కాలంలో చాలా బోర్ గా ఫీల్ అవుతుంటారు.

చాలామంది ప్రయాణికులు తమ ప్రయాణ కాలంలో చాలా బోర్ గా ఫీల్ అవుతుంటారు. కొంత మంది పక్కవారితో ముచ్చట్లు పెట్టుకుంటే, కొంతమంది వారి ఫోన్లలో ఆడుకుంటూ, పాటలు వింటూ ప్రయాణిస్తారు. ఈ నేపధ్యంలోనే మెట్రో రైలు ఒక వినూత్న ఆలోచనని చేసింది. మెట్రో ప్రయాణికులకు తీపికబురు తెలిపింది. కొద్ది సేపు మాత్రమే చేసే ఈ ప్రయాణంలో ప్రజలు బోర్‌గా ఫీలవకుండా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.

విమానాలలో ఏవిధంగానైతే నచ్చిన గేమ్‌లు, సినిమాలను వీక్షించే వెసులుబాటు ఉందో ఇప్పుడు అలాంటి వెసులుబాటును మెట్రో సర్వీసుల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రయాణికులు వారి వద్ద ఉన్న ఫోన్‌డేటాను వినియోగించాల్సిన అవసరం లేదు. ప్రతి మెట్రో స్టషన్లో ఆ సంస్థనే ప్రత్యేక వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీ5 యాప్‌ ద్వారా ఈ సేవలను అందించనున్నారు.

నగరంలోని ఎల్బీనగర్‌ స్టేషన్ నుంచి లింగంపల్లి, నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు ప్రయాణించే ప్రయాణికులంతా ఈ వైఫై సేవలను పొందవచ్చు. మంగళవారం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు మెట్రో ప్రకటించింది. ఇక మెట్రోలో ప్రయాణించే వారందరూ వారిని నచ్చిన గేమ్స్, సినిమాలు చేస్తూ ప్రయాణాన్ని హాయిగా చేసుకోవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories