నిండు కుండను తలపిస్తున్న శ్రీరాంసాగర్

నిండు కుండను తలపిస్తున్న శ్రీరాంసాగర్
x
Highlights

భారీగా కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండడంతో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భారీగా కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దీంతో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల ఈ సారి పంటలు పండించడాని ఎలాంటి నీటి కొరత ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర, నిజామాబాద్‌ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇప్పటి వరకు ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా నమోదైంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎమ్‌సీలు కాగా, ప్రస్తుతం 89 టీఎమ్‌సీల నీరు నిల్వఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరింది. జులై మూడో వారం నాటికి ప్రాజెక్టులో నీరు డెడ్‌ స్టోరేజీ ఐదు టీఎమ్‌సీలకు చేరుకోగా రెండు నెలల కాలంలోనే ప్రాజెక్టు పూర్తిగా జలకళను సంతరించుకోవడం విశేషం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories