Top
logo

కరీంనగర్‌ జిల్లా మన్నెంపల్లి వరద కాల్వకు గండి

కరీంనగర్‌ జిల్లా మన్నెంపల్లి వరద కాల్వకు గండి
Highlights

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో వరద కాల్వకు గండి పడింది.

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో వరద కాల్వకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నీరు ఇళ్లల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, విలువైన సామాగ్రి నీటిపాలయ్యాయి. చెరువులను నింపాలన్న లక్ష్యంతో.. తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి వరదకాల్వను నిర్మించారు.

గత కొన్ని రోజులుగా తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి వరద కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా మన్నెంపల్లి చెరువులను నింపుకున్నారు. మానకొండూరు మండలంలోని పెద్దూరుపల్లికి నీటిని తరలిస్తుండగా.. కాల్వకు గండి పడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి ఊరు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Web TitleMannempalli flood canal in Karimnagar district
Next Story


లైవ్ టీవి