కాపురం కూల్చిన కళ్యాణ లక్ష్మి చెక్కు .. కట్నం చెక్ రాలేదని భార్యను పుట్టింటికి పంపేసిన భర్త

కాపురం కూల్చిన కళ్యాణ లక్ష్మి చెక్కు .. కట్నం చెక్ రాలేదని భార్యను పుట్టింటికి పంపేసిన భర్త
x
Highlights

ఉన్న ఊరే కన్న తండ్రి అయింది. ఆమెకు అండగా నిలిచింది. అంతా చందాలు పోగు చేసి బిడ్డ పెళ్లి చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కును కట్నంగా చూపింది. పెళ్లి...

ఉన్న ఊరే కన్న తండ్రి అయింది. ఆమెకు అండగా నిలిచింది. అంతా చందాలు పోగు చేసి బిడ్డ పెళ్లి చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కును కట్నంగా చూపింది. పెళ్లి జరిగింది. సంవత్సరం గడిచింది. కానీ కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసినా చెక్కు రాలేదు. కట్నం చెక్కు తీసుకొస్తేనే కాపురానికి రా అంటూ భర్త ఆ అమ్మాయిని పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన చెవిటి సరిత కన్నీటి కథ ఇది!

కళ్యాణ లక్ష్మి కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే డబ్బు అందలేదని ఓ భర్త తన భార్యను వదిలేశాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన సరితకు ఏడాది క్రితం గుడిపేటకి చెందిన రమేష్ తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో రమేష్‌కు 40 వేలు ఇచ్చిన పెళ్లికూతురు తల్లిదండ్రులు.. కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే లక్షా 116 రూపాయలను కట్నంగా ఇస్తామని వాగ్దానం చేశారు. దీనికి అంగీకరించిన రమేష్ సరితను పెళ్లి చేసుకున్నాడు. నెలలు గడుస్తున్నా సరితకు ప్రభుత్వం నుంచి డబ్బు అందలేదు. 6 నెలల పాటు వేచి చూసిన రమేష్ ఆ తర్వాత కట్నం డబ్బు కోసం సరితను వేధించడం మొదలు పెట్టాడు. కట్నం డబ్బు ఇస్తేనే కాపురం చేస్తానని. సరితను పుట్టింట్లో వదిలేశారు. దీనిపై తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా వెంటనే ప్రభుత్వం స్పందించి తనకు కళ్యాణ లక్ష్మి డబ్బు అందేలా చూడాలని, తన కాపురాన్ని నిలబెట్టాలని సరిత వేడుకుంటోంది.

కళ్యాణ లక్ష్మి చెక్కును ఎమ్మెల్యే సంతకానికి పంపామని అయితే ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని అధికారులు అంటున్నారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, వీలైనంత త్వరగా సరితకు చెక్ అందేలా చూస్తానని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సరితకు కళ్యాణ లక్ష్మి డబ్బు అందేలా చూడాలని, ఆమె కాపురాన్ని నిలబెట్టాలని కొండయ్యపల్లె గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సరిత బతుకు తెరువు కోసం బీడీలు చుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది.. తన భర్త ఫోన్‌ చేసినా భర్త మాట్లాడడం లేదని, కల్యాణలక్ష్మి డబ్బు ఎప్పుడు వస్తుందో.. తాను ఎప్పుడు భర్త వద్దకు వెళతానో తీరా డబ్బు వచ్చినా ఆయన ఏమంటాడోనని ఆందోళన చెందుతోంది. మరి సరిత సమస్యకు ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories