అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌

అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌
x
సోలార్ పవర్ ప్లాంట్
Highlights

తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు ఉత్పత్తిలో ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం, కొత్తగూడెం థర్మల్...

తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు ఉత్పత్తిలో ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం లాంటి విద్యుత్ కేంద్రాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాక అక్కడక్కడా సోలార్ విద్యుత్ కేంద్రాలను కూడా ఏర్పరుస్తుంది. దీంతో ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ ను సరఫరా చేస్తుంది.

ఇప్పుడు ఇదే కోణంలో హైదరాబాద్ లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసారు. ఈ అతిపెద్ద రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో నెలకొల్పారు. ఈ విద్యుత్ కేంద్రాన్ని మొదట 2018లో 500 కిలో వాట్ల ప్లాంట్‌గా ఉర్పాటు చేసారు. దీన్నే ఇప్పుడు విస్తరించి తాజాగా 350 కిలోవాట్ల సామర్థ్యం గల మరో ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసారు. ఈ ప్లాంటును నెలకొల్పడానిక మొత్తం రూ.3.81 కోట్లను వెచ్చించారు. ఈ సంస్థ పెట్టిన పెట్టుబడిలో రూ.95 లక్షల (25 శాతం)ను జాతీయ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ రీయింబర్స్‌ చేసింది. ఈ రెండింటినీ కలపడంతో ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్ ప్లాంట్‌గా నిలిచింది.

ఇంతే కాక దీన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల్లో ఈ ప్లాంటును మళ్లీ 150 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌గా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా 1,000 కిలోవాట్ల సామర్థ్యం ఏర్పడనున్నటు సంస్థ వర్గాలు తెలిపాయి.

ఈ విద్యుత్తును రూఫ్‌టాప్‌ సోలార్‌ నెట్‌ మీటరింగ్‌లో భాగంగా భవనాలపైగల సోలార్‌ ప్లాంట్‌ ను డిస్కం గ్రిడ్‌కు కనెక్షన్‌ ఇస్తారు. దీని ద్వారా ఎవరి భవనాల పై ఉత్పత్తయిన విద్యుత్‌ను వారు మాత్రమే వాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక మిగిలిన విద్యుత్తును ఇతర రాష్ట్రాను అమ్మకం చేస్తుంది. దీంతో రాష్ట్రానికి లాభాలు చేకూరే అవకాశం ఉండకపోలేదు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories