భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా యాదాద్రి: కేటీఆర్

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా యాదాద్రి: కేటీఆర్
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణానికి గాను 750 కోట్ల నిధులను విడుదల చేసారు. ఈ క్రమంలోనే ఆలయ పునర్నిర్మాణ పనులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు.

ఈ ఆలయాన్ని మొత్తం రాతితోనే నిర్మించారు. దీనికి మొత్తంగా చూసుకుంటే రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్‌ను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకూ ఏ ఆలయాన్ని కూడా ఈ విధంగా రాతితో కట్టలేదని గ్రానైట్ తో కట్టిన అతిపెద్ద ఆలయంగా యాదాద్రి నిలిచిపోతుందని ఆయన తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, ప్రాచీన కట్టడాల మాదిరిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించడం సీఎం కేసీఆర్‌ గొప్పతనమని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. రాబోయే 2000 ఏళ్ల వరకూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుందన్నారు. భారతదేశంలోనే ఇది ఒక గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని ఆ‍యన ట్వీట్‌ చేసిన వీడియోలో పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories