ఆ రేఖను మనం నేలమట్టం చేసేద్దాం : మంత్రి కేటీఆర్

ఆ రేఖను మనం నేలమట్టం చేసేద్దాం : మంత్రి కేటీఆర్
x
KTR
Highlights

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృభిస్తుంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృభిస్తుంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. కాగా చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో ప్రపంచ దేశాల కంటే భారతదేశం ముందంజలో ఉందని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగక ముందే లాక్ డౌన్ చర్యలను సమర్ధవంతంగా తీసుకుని కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగామని ఆయన చెప్పారు. ఇంకా ఈ కరోనా కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించగలిగే అవకాశం మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, ఇండ్లనుంచి బయటికి రావొద్దని ఆయన తెలిపారు.

చైనా కంటే ఇటలీ, స్పెయిన్‌, యూకే, యూఎస్‌లలో కరోనా వైరస్‌ మరణాల రేటు వేగంగా పెరుగుతుందని తెలిపారు. అగ్రారాజ్యాలలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారని ఆయన అన్నారు. కానీ భారత్ లో మాత్రం ఇప్పటివరకు కేవలం 26 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఇండియా కరోనాను ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

ఇక ఇదే విషయాన్ని ఆయన తాజాగా జాన్‌ బర్న్‌ ముర్డోచ్‌ రూపొందించిన గ్రాఫ్ ఆధారంగా చూపించారు. ఈ గ్రాఫ్ లో ప్రపంచ దేశాలలో ఎన్ని దేశాలలో ఎంత శాతం కరోనా కేసులు నమోదయ్యాయనే విషయాలు స్పష్టంగా చూపించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా విజృంభిస్తున్న గీతల ద్వారా గ్రాఫ్ లో చూపించారు. అందులో అన్ని దేశాల కంటే భారతదేశం ప్రారంభదశలోనే ఉందని తెలుపుతుంది. ఇక ఈ గ్రాఫ్ ను కేటీఆర్ ఆయన ట్విటర్ లో షేర్ చేస్తూ ఈ విధంగా రాసారు.

ఇదే విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కమాన్ ఇండియా అంటూ ఆయన భారతీయులందరికీ పిలుపు ఇచ్చారు. మనం మిగిలిన దేశాలకంటే బాగా చేస్తున్నాం... ఆ రేఖను మనం నేలమట్టం చేసేద్దాం' అంటూ పేర్కొన్నారు. దీంతో నెటిజన్స్ అంతా స్పందించి లాక్ డౌన్ మనల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories