కేటీఆర్‌కు ఘన స్వాగతం..

కేటీఆర్‌కు ఘన స్వాగతం..
x
దావోస్ లో కేటీఆర్
Highlights

ప్రతి ఏడాది నిర్వహించినట్టు గానే ఈ ఏడాది కూడా స్విట్జర్లాండ్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఈ నెల 21 నుంచి 24...

ప్రతి ఏడాది నిర్వహించినట్టు గానే ఈ ఏడాది కూడా స్విట్జర్లాండ్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుందని, ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తప్పక హాజరు కావాలని ఫోరం సభ్యులు తెలిపారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ ఆహ్వానం అందుకున్న కేటీఆర్ దావోస్‌కు చేరుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షులు గందె శ్రీధర్‌ మంత్రికి స్వాగతం పలికారు. ఈ సదస్సుకు కేటీఆర్ తో పాటు వివిధ దేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు, రాజకీయవేత్తలు పాల్గొంటారని ఫోరం సభ్యులు తెలిపారు. ఈ సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవంలో 'టెక్నాలజీ ప్రయోజనాలు-ఎదురయ్యే సవాళ్ల'పై చర్చ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రగతిని వివరించేలా ప్రసంగించనున్నారు. తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో ఏ విధమైన పెట్టుబడులకు పెట్టొచ్చో వివరించనున్నారు. సదస్సు అనంతరం ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. వారికి రాష్ట్రంలోని అవకాశాలు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories