20 ఏళ్ల కిందటి ఫోటో.. కేటీఆర్ యంగ్ లుక్స్

20 ఏళ్ల కిందటి ఫోటో.. కేటీఆర్ యంగ్ లుక్స్
x
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు సోషల్ మీడియా పరంగా ఎంత ఆక్టివ్‌గా ఉంటారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ట్వీట్టర్ ద్వారా కేటీఆర్ ప్రతిఒక్క విషయం షేర్ చూస్తూ ఉంటారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు సోషల్ మీడియా పరంగా ఎంత ఆక్టివ్‌గా ఉంటారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ట్వీట్టర్ ద్వారా కేటీఆర్ ప్రతిఒక్క విషయం షేర్ చూస్తూ ఉంటారు. అలాగే ట్వీట్లో తనకు ట్యాగ్ చేసిన వారికి కూడా తనకు తొచిన సహాయం చేస్తూ మనసున్న మహారాజుగా పేరు కూడా తెచ్చుకున్నాడు. చాలా మందికి ఆర్ధికంగా అదుకున్నారు. ఇలా సోషల్ మీడియా పరంగా అందరి మనసుదోచుకుంటున్నా.. కేటీఆర్ తాజాగా తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ 1999 నాటి ఓ ఫొటోను ట్వీట్టర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. అందులో కేటీఆర్ జీన్స్ షర్ట్, మీసకట్టు, క్లీన్ షేవింగ్‌తో..పాటు మిడిల్ హెయిర్ స్టైల్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు కేటీఆర్. ఈ ఫొటోను 1999 ఫిబ్రవరి 14వ తేదీన తీసినట్టుగా ఆ ఫోటోలో అవుపిస్తోంది.

కేటీఆర్ ఓ బల్ల మీద కూర్చుని ఉంటే, పక్కన మరో యువకుడు కూర్చున్నాడు. ఫొటో తీసినప్పుడు కేటీఆర్ పక్కన ఉన్న యువకుడు కళ్లు మూసుకుని ఉన్నాడు. అతడి పేరు మహేష్ ఓదెల అని కేటీఆర్ చెప్పారు. ఇక ఇప్పుడు ఈ ఫొటోను కేటీఆర్ అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. నెటినజన్లు కామెంట్ల వర్షం కురిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా కొన్ని సినిమాలకు సంతకాలు చేయాల్సిందంటూ కామెంట్ చేశారు. మరికొందరు లవర్ బాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories