KTR Tweet: రూపాయి ఐసీయూలో ఉంది.. విశ్వగురు మోడీ.. మీకో నమస్కారం

KTR Satires On The Central Government Behavior On Twitter
x

KTR Tweet: రూపాయి ఐసీయూలో ఉంది.. విశ్వగురు మోడీ.. మీకో నమస్కారం

Highlights

KTR Tweet: హైదరాబాద్‌,''ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పడిపోతోంది

KTR Tweet: హైదరాబాద్‌,''ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పడిపోతోంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రధాని మోదీ ఫొటోలు చౌక ధరల దుకాణాల్లో పెట్టడంలో నిమగ్నమై ఉన్నారు'' అంటూ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రూపాయి దాని సహజ మార్గాన్ని కనుగొంటుందని ఆర్థిక మంత్రి చెబుతున్నారని.. ఆర్థిక కష్టాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.. దేవుడి చర్యగా అభివర్ణిస్తున్నారని విమర్శించారు. 'విశ్వగురు మోదీ.. మీకో నమస్కారం..' అంటూ శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రూపాయి విలువ పడిపోవడంతో ప్రస్తుతం రూపాయి ఐసీయూలో ఉందన్నారు. మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలే దీనికి కారణమని విమర్శించారు. 2013లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. రూపాయి విలువ పతనం విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శల ట్వీట్లను మంత్రి పోస్ట్‌ చేశారు. కేంద్రం అవినీతిలో కూరుకుపోవడంతో రూపాయి ప్రస్తుతం ఐసీయూలో ఉందని మోదీ అప్పుడు ట్వీట్‌ చేశారు. అదే విషయాన్ని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. కాగా, అక్టోబరు 20న సెర్బియాలో జరగనున్న అంతర్జాతీయ బయోటెక్‌ సదస్సులో పాల్గొనాలని అక్కడి ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ సదస్సును సెర్బియా ప్రభుత్వం, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories