ఫ్లెక్సీలు పెట్టినందుకు రూ. లక్ష జరిమానా...

ఫ్లెక్సీలు పెట్టినందుకు రూ. లక్ష జరిమానా...
x
Highlights

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణాల్లో విస్తృతంగా పర్యటించారు. అనంతరం...

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణాల్లో విస్తృతంగా పర్యటించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లందు మున్సిపాలిటీలో కూడా ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించి అక్కడ విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూసారు. అనంతరం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించిన ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వేంకటేశ్వర్లు పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు రూ.లక్ష జరిమానా విధించారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎవరిమీదనైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధించిన జరిమానాను సదరు వ్యక్తి నుంచి వెంటనే వసూలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పల్లె, పట్టణ అభివృద్ధిపై అత్యంత ప్రాధాన్యత కనబరుస్తోందని ఆయన అన్నారు. పట్టణాలను, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోతే రేపటి నాటికి వాటిని పట్టించుకునే నాథులు లేక చెత్తాచెదారంగా తయారవుతాయని మంత్రి అన్నారు. ప్రచారంలో భాగంగా ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చును గ్రామల, పట్టణాల, మున్సిపల్‌ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు. పట్టణ ప్రగతి ముఖ్య ఉద్ధేశ్యాన్ని ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు అధికారులు కూడా హాజరయ్యారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories