KTR: ఆ నోటీసులు కోమటిరెడ్డికే పంపండి: మాణికం ఠాగూర్‌కి కేటీఆర్‌ కౌంటర్‌

KTR: నోటీసులు పంపాలని ఠాకూర్‌కు సూచన చేస్తూ ట్వీట్‌

Shekhar G
Updated on: 31 Jan 2024 2:55 PM IST
KTR Counter To Manickam Tagore Comments in X Platform
X

KTR: ఆ నోటీసులు కోమటిరెడ్డికే పంపండి: మాణికం ఠాగూర్‌కి కేటీఆర్‌ కౌంటర్‌

KTR: పరువు నష్టం దావా వేస్తామన్న కాంగ్రెస్ మాజీ ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు. ఠాకూర్ అయోమయంలో ఉన్నారన్న ఆయన.. తప్పుడు అడ్రస్‌కు నోటీస్ పంపిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఠాకూర్‌కు 50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్‌ పదవి కొనుక్కున్నారని.. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేశారు కేటీఆర్‌. కోమటిరెడ్డి మాట్లాడిన 50 కోట్ల లంచం వార్తలనే తానూ ప్రస్తావించానని తెలిపారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదన్న కేటీఆర్.. ఠాకూర్‌ పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని సూచించారు. తన చిరునామాకు కాకుండా సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలని ట్వీట్ చేశారు.


Shekhar G

Shekhar G

Next Story