మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్

మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్
x
కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Highlights

హైదరాబాద్ నగరంలోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు రెండో కారిడార్ ను ఈ నెల 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.

హైదరాబాద్ నగరంలోని జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు రెండో కారిడార్ ను ఈ నెల 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా ఇప్పుడు ఈ విషయం గురించి హైదరాబాద్ మెట్రో రైల్ ఉన్నతాధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 కిలోమీటర్ల దూరం, 9 స్టేషన్లతో నిర్మించిన ఈ మెట్రో కారిడార్ పనులకు కేంద్రం కూడా భాగస్వామ్యంగా ఉందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం తమను ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక వైపు పార్లమెంట్ నడుస్తుంటే, మరో వైపు ఈ ప్రారంభోత్సం కార్యక్రమాన్ని ఏవిధంగా నిర్వహిస్తారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మెట్రో అధికారులతో రేపు దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అంతే కాక జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో ట్రైన్ లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాంచందర్‌రావు ప్రయాణించి జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లను పరిశీలిస్తామని తెలిపారు.

మెట్రో నిర్మాణంలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని చెప్పేందుకే బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక పోతే ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జేబీఎస్ - ఎంజీబీఎస్ రెండో మెట్రో కారిడార్ తో హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద రెండో మెట్రోగా ఆవిర్భవించింది. కాగా ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవడంతతో బీజేపీ అసంతృప్తిని వ్యక్తం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories