ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్...

ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్...
x
Highlights

దగ్గు, జలుబు, తలనొప్పి ఉన్న వారికి కరోనా వస్తుందని, అలాంటి లక్షణాలు లేని వారికి కరోనా రాదని అనుకుంటే పొరపాటే అని తేల్చేసాడు ఓ వ్యక్తి.

దగ్గు, జలుబు, తలనొప్పి ఉన్న వారికి కరోనా వస్తుందని, అలాంటి లక్షణాలు లేని వారికి కరోనా రాదని అనుకుంటే పొరపాటే అని తేల్చేసాడు ఓ వ్యక్తి. ఇప్పటి వరకు ఢిల్లీ మర్కజ్ వెల్లి వచ్చిన వారికో లేదా విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనాన పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇటీవల ఢిల్లీకి వెల్లివచ్చిన ఓ గిరిజన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు మాత్రమే కాదు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.

ఈ సంఘటన పూర్తివివరాల్లోకెళితే ఖమ్మం నగరంలోని మొదటి డివిజన్‌ పెద్దతండాకు చెందిన ఓ గిరిజన వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఢిల్లీకి వెల్లి వచ్చాడు. ఆయన సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని అధికారులు తెలిపారు. కాగా అతను ఈ నెల 14వ తేదిన ఢిల్లీకి ఖమ్మం నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్లారు. అనంతరం ఆయన అక్కడే మూడు రోజుల పాటు గడిపాడు. ఆ మూడురోజుల్లో 15వ తేది ఢిల్లీలోని అంబేద్కర్‌ భవనంలో బస చేసారు. మరునాడు అంటే 16వ తేదీన నగరంలోని నోయిడా ప్రాంతంలో నిర్వహించిన ఓ రాజకీయ కార్యక్రమానికి ఆయన హజరయ్యారని తెలిపారు.

ఇక 17వ తేది 12 మంది వ్యక్తులతో కలిని అతన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఖాజీపేట జంక్షణ్ ను చేరుకున్నారన్నారు. 18వ తేదిన అతని కుటుంబ సభ్యలుతో గడిపి, 19, 20వ తేదీలో ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఆ తరువాత లాక్ డౌన్ నేపధ్యంలోనే 21వ తేది నుంచి ఇంట్లోనే ఉన్నారన్నారు. అయితే ఆ వ్యక్తి టీవీల్లో వస్తున్న వార్తలను చూసి కేవలం ఢిల్లీ వెల్లివచ్చాననే కారణంతోనే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కాగా రిపోర్టుల్లో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని రావడంతో అందరూ ఖంగుతిన్నారని తెలిపారు.

అసలు కరోనా లక్షణాలు ఒక్కటి కూడా లేకుండానే అలా ఎలా సాధ్యం అని వైద్యులు విస్మయానికి గురవుతున్నారు. ఈ విషయంలపై కొంత మంది శాస్త్రవెత్తలు మాట్లాడుతూ కొంతమందికి జబ్బు ఉన్నప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవని తెలుపుతున్నారు. ఇలాంటి వారి ద్వారానే కరోనా మరి కొంత మందికి సోకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories