బయటకొచ్చిన మాజీ తహసీల్దార్‌ నాగరాజు చివరి వీడియో కాల్ ఫుటేజ్‌..ఏం చెప్పాడంటే

బయటకొచ్చిన మాజీ తహసీల్దార్‌ నాగరాజు చివరి వీడియో కాల్ ఫుటేజ్‌..ఏం చెప్పాడంటే
x
Highlights

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఈనెల 14న చంచల్‌గూడ జైల్లో టవల్‌తో ఉరివేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు కస్టోడియల్‌ డెత్‌గా నమోదు...

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఈనెల 14న చంచల్‌గూడ జైల్లో టవల్‌తో ఉరివేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు కస్టోడియల్‌ డెత్‌గా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు చివరిసారి వీడియో కాల్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రెండవ కేసులో ఎమ్మార్వో నాగరాజు ఏసీబీ అధికారులు కస్టడికి తీసుకోడానికి ముందు కేసు విషయంలో సంభాషణలు కొనసాగింది. కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న నాగరాజు నేను ఏతప్పు చేయలేదని పేపర్లన్నీ ప్రాపర్ గానే ఉన్నాయి అని వారికి చెపుతున్నారు. రికార్డ్స్ అన్ని పరిశీలించామని, ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావు వెరిఫై చేసి మరీ చేశామని ఎమ్మార్వో నాగరాజు వీడియోలో చెప్పారు. ఈ విషయాలన్నీ వారి న్యాయవాదికి చెప్పి కోర్టులో అన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టాలని కుటుంబ సభ్యులకు విన్నపం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు నువు బెయిల్ పై బయటకు వచ్చాక న్యావవాదితో మాట్లాడి కోర్టులో అన్ని విషయాలు చెపుదాం అని నాగరాజుకు చెప్పారు. నాగరాజు చనిపోయాక బయటకు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక పోతే భూ వివాదం కేసులో కీసరగుట్ట ఎమ్మార్వో నాగరాజు కోటి 10 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ కేసులో నాగరాజుతో పాటు మరికొంత మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే అరెస్టయిన వారిలో కొంత మందికి బెయిల్ మంజూరు అయినప్పటికీ నాగరాజు కు మాత్రం బెయిల్ మంజూరు కాలేదు. దీంతో హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైల్లో ఉన్న నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే చివరి సారిగా చనిపోడానికి ముందు కుటుబంతో ఎమ్మార్వో నాగరాజు వీడియో కాల్ మాట్లాడారు. ఇక నాగరాజు మృతి ఆయన కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాను ఉన్న పక్కను మరో ముగ్గురు ఖైదీలు ఉండగా నాగరాజు టవల్‌తో ఎలా ఆత్మహత్య చేసుకుంటారన్నారు. అలా ఎలా సాధ్యం అయింది అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా హత్యేనని, ఆత్మహత్య కాదని సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories