ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు
x
File Photo
Highlights

-52 రోజుల సమ్మె కాలం జీతం ఇస్తామని హామీ -సెప్టెంబర్ నెల జీతం రేపు చెల్లింపు -ఆర్టీసీ కార్మికులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రగతి భవన్ లో కార్మికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్..కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముఖాముఖి నిర్వహించారు. 52 రోజుల సమ్మె కాలం జీతాన్న కూడా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం రోజునే సమ్మె కాలం జీతం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళ ఉద్యోగులు కోరిన విదంగా ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. ఆర్టీసీ కార్మికులకు రిటైర్మంట్ వయో పరిమితి 60 సంవత్సరాలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరిన తర్వాత వారితో సమావేశమవుతానని గత క్యాబినెట్ సమావేశానంతరం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ మాట ప్రకారం వారిని ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ఆర్టీసీ మనుగడ కోసం కష్టించి పని చేయాలని కార్మికులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వస్తే సింగరేణి మదిరిగా బోనస్ ఇస్తామని ప్రకటించారు. ప్రయాణికులు టిక్కెట్ తీసుకోకపోతే కండక్టర్లకు విధిస్తున్న జరిమానాను ఇకపై ప్రయాణికుల నుంచే వసూలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పించాలని, ఇకపై మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండొద్దని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు. ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories