Top
logo

రేపటి నుంచి కేసీఆర్‌ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

రేపటి నుంచి కేసీఆర్‌ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..
Highlights

సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మార్చి 29న సాయంత్రం నాలుగు గంటలకు నల్లగొండ లోక్‌సభ...

సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మార్చి 29న సాయంత్రం నాలుగు గంటలకు నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు హైదరబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల (కొంత భాగం) లోక్‌సభ సెగ్మెంట్ల ఉమ్మడి బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం. మార్చి 31న సాయంత్రం నాలుగు గంటలకు వనపర్తి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మహబూబ్‌నగర్‌ లో బహిరంగ సభకు హాజరవుతారు.

అలాగే ఏప్రిల్‌ 1న సాయంత్రం నాలుగు గంటలకు రామగుండం సభలో పాల్గొంటారు. ఏప్రిల్‌ 2న సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్‌లో సాయంత్రం ఐదున్నర గంటలకు భువనగిరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఏప్రిల్‌ 3న సాయంత్రం నాలుగు గంటలకు జహీరాబాద్‌, సాయంత్రం ఐదున్నర గంటలకు నర్సాపూర్‌లో సభలో పాల్గొంటారు. ఏప్రిల్‌ 4న సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్‌, ఐదున్నర గంటలకు ఖమ్మం బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.

Next Story