ఐటీ, కొత్త ఉద్యోగాల విషయంలో బెంగళూరును దాటుతాం: కేటీఆర్

ఐటీ, కొత్త ఉద్యోగాల విషయంలో బెంగళూరును దాటుతాం: కేటీఆర్
x
Highlights

కొత్త ఆఫీస్ స్పేస్ తీసుకోవడంలో హైదరాబాద్ ఈ ఏడాది బెంగళూరును దాటేసిందన్నారు కేటీఆర్. ఐటీ, కొత్త ఉద్యోగాల విషయంలో బెంగళూరును దాటుతామన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ JLL కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కేటీఆర్ ప్రారంభించారు.

కొత్త ఆఫీస్ స్పేస్ తీసుకోవడంలో హైదరాబాద్ ఈ ఏడాది బెంగళూరును దాటేసిందన్నారు కేటీఆర్. ఐటీ, కొత్త ఉద్యోగాల విషయంలో బెంగళూరును దాటుతామన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ JLL కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ అధిగమిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలో ఆక్యుపై అయిన మొత్తం ఆఫీస్‌ స్పేస్‌లో 27శాతం హైదరాబాద్ నుంచే జరిగిందన్నారు. ఈ ఏడాది కొత్త బెంగళూరుకంటే అధికంగా ఇక్కడ ఆఫీస్ స్పేస్ తీసుకున్నారని అన్నారు.

హైటెక్ సిటీ వైపు ట్రాఫిక్‌ను తగ్గించడానికి లుక్ ఈస్ట్ పాలసీని తీసుకువచ్చామన్నారు కేటీఆర్. ఇటువైపు ఆఫీస్‌లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక రాయితీలిస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి వేగం ఇప్పుడే మొదలైందని రానున్న రోజుల్లో అద్భుత ఫలితాలను చూస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇన్వెస్టర్లలో విశ్వాసం మరింత పెరిగి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని జెఎల్‌ఎల్ తమ రిపోర్టులో పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories