logo

కేసీఆర్ న్యాయకత్వం దేశానికే అవసరం: ఎమ్మెల్యే బాల్క సుమన్

కేసీఆర్ న్యాయకత్వం దేశానికే అవసరం: ఎమ్మెల్యే బాల్క సుమన్
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్న నేపథ్యంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారం బరాజ్‌వద్ద జలజాతర...

కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్న నేపథ్యంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారం బరాజ్‌వద్ద జలజాతర నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈసందర్భంగా అన్నారం ప్రాజెక్టును సందర్శించిన నేతలు కాళేశ్వరం నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.. కాళేశ్వరం జాతరను శ్రీరామ్ సాగద్ వద్ద చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయని కేసీఆర్ నాయత్వం దేశానికే అవసరమని ఎమ్మెల్యే సుమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేతలు ఆనందంతో డ్యాన్స్ చేశారు.

లైవ్ టీవి


Share it
Top