తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
x
Highlights

తెలంగాణా లో ఇంటర్ పరీక్షలు కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈసారి అధికారులు ముందునుంచే ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమంతించమని చెబుతూ...

తెలంగాణా లో ఇంటర్ పరీక్షలు కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈసారి అధికారులు ముందునుంచే ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమంతించమని చెబుతూ వచ్చారు. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చాలా ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకూ కొనసాగుతుంది.

విస్తృత ఏర్పాట్లు..

కాగా ఇంటర్ పరీక్షల కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసందుకు ప్రత్యేకంగా కౌన్సిలర్లను ఏర్పాటు చేశారు. 7337225803 నంబరుకు కాల్ చేయడం ద్వారా విద్యార్థులు వారి ఇబ్బందులు చెప్పుకోవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక ఫిర్యాదులు ఉంటె కనుక కంట్రోల్‌ రూం నంబరు 040-24600110/24732369కు ఫోన్ చేసి చెప్పాలని బోర్డు సూచించింది.

ఇక ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,65,875 హాజరవుతున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,82,808 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 4,83,067 మంది ఉన్నారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని సులువుగా గుర్తించేందుకు గాను సెంటర్ లొకేటర్ యాప్ ను రూపొందించినట్టు అధికారులు చెప్పారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories