Top
logo

ఎర్రమంజిల్, సచివాలయం కూల్చివేతలపై హైకోర్టులో విచారణ

ఎర్రమంజిల్, సచివాలయం కూల్చివేతలపై హైకోర్టులో విచారణ
Highlights

ఎర్రమంజిల్‌, సచివాలయం కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదనలు...

ఎర్రమంజిల్‌, సచివాలయం కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే విచారణలో భాగంగా ఏ ప్రాతిపదికన పురాతన భవనాలు తొలగించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు లేదని ప్రభుత్వం తరుపున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్ర రావు కోర్టుకి వివరణ ఇచ్చారు. కూల్చివేతలపై ప్రభుత్వం.. చట్టబద్ధంగానే నిర్ణయాలు తీసుకుందని, నిపుణుల సిఫారసు మేరకే కొత్త భవనాలు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియచేశారు ఏడీజీ.


లైవ్ టీవి


Share it
Top