సారు-కారు పాలనలో బారు-బీరే ప్రధానం : డీకే అరుణ

సారు-కారు పాలనలో బారు-బీరే ప్రధానం : డీకే అరుణ
x
మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ
Highlights

ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందించారు. మహిళలకు ర‌క్షణ కల్పించాని ఆమె ప్రభుత్వాన్ని కోరారు....

ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందించారు. మహిళలకు ర‌క్షణ కల్పించాని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మద్యం నిషేదంపై ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో 2 రోజుల పాటు అంటే 12, 13 తేదీల్లో మహిళా సంకల్ప దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ నాయకురాలు డీకే అరుణ వెల్లడించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జరిగే అఘాయిత్యాలన్నింటికీ దాదాపుగా ఈ మద్యమే కారణమని ఆమె తెలిపారు. తాగిన మైకంలో దుండగులు చిన్నపిల్లలను కూడా వదలడం లేదని ఆమె తెలిపారు. తాగి మద్యం మత్తులో వాహనాలకు నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. సారు-కారు పాలనలో బారు-బీరే ప్రధానమైందని విమర్శించారు. బంగారు తెలంగాణాలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో రాష్ట్రాన్ని నడపడమంటే రక్తం కోసం అశపడినట్లే అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన దిశ, సమతపై జరిగిన హత్యాచారం కేసులలో నిందితులు కూడా తాగిన మైకంలోనే ఉన్నట్టు ఆమె వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు తీసేసి, మద్య నిషేధంను అమలు చేయాలన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories