వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు : సీపీ అంజనీ కుమార్

వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు : సీపీ అంజనీ కుమార్
x
Highlights

నగరంలో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వారిలో చాలా మంది రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను రోడ్లపైకి తీసుకువస్తే, మరికొంత మంది నంబరు ప్లేట్లపై...

నగరంలో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వారిలో చాలా మంది రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను రోడ్లపైకి తీసుకువస్తే, మరికొంత మంది నంబరు ప్లేట్లపై నంబర్లు కనిపించకుండా ఉండేట్టు సన్నగా రాపిస్తున్నారు. ఇలా చేసే వారిలో చాలా మంది ట్రాఫిక్ నిబంధనలకు అతిక్రమించేవారు ఉన్నారని, నంబరు కనిపించకుండా పెట్టుకుంటే చలానాల నుంచి తప్పించుకోవచ్చన్ని మరికొంత మంది ఆకతాయిలు ఆలోచిస్తుంటారు. అంతే కాదు మరికొంత మంది అయితే ఏకంగా తప్పుడు నంబరు ప్లేట్లను వాహనాలకు బిగించుకుని వెలుతుంటారు.

ఇక ఇలాంటి వారి కోసం హైదారాబాద్ పోలీస్ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని వాహనదారులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వాహనాల నంబరు ప్లేట్లు స్పష్టంగా ఉండని పక్షంలో వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని చైన్ స్నాచర్గా అనుమానిస్తామని హెచ్చరించారు. నగరంలో దాదాపుగా 2 వేల వాహనాలు నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయని వాటికి సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని అంజనీ కుమార్ తన ట్వీటర్ ఖాతాలో ట్వీట్ చేసారు.

ఈ మేరకు 384 మంది వాహనదారలను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసామని, వారి వాహనాలకు నంబరు ప్లేట్లు సరిగ్గా లేవని ఆయన ట్విటర్ ద్వారా సీపీ తెలిపారు. ఎవరైనా రోడ్లపై నంబర్‌ ప్లేట్లు సరిగ్గా లేకుండా కనపడితే వెంటనే దాన్ని ఫొటో తీసి 9490616555 నెంబరుకు వాట్సాప్ చేయాలని నగర పౌరులను సీపీ ట్విట్టర్‌లో కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories