Hyderabad Police Commissioner anjani kumar: పాములను చంపొద్దు

Hyderabad Police Commissioner anjani kumar: పాములను చంపొద్దు
x
Cp anjani kumar catches snake
Highlights

Hyderabad Police Commissioner anjani kumar: కొంత మంది పాములను చూస్తే చాలు భయపడి ఇక్కడున్న వారు ఎక్కడికో పరుగులు పెడతారు.

Hyderabad Police Commissioner anjani kumar: కొంత మంది పాములను చూస్తే చాలు భయపడి ఇక్కడున్న వారు ఎక్కడికో పరుగులు పెడతారు. కొంత మంది అది ఎక్కడ వాళ్లకి హాని తలపెడుతుందో అని దాన్ని వెంటాడి మరీ చంపేస్తుంటారు. కానీ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ మాత్రం పామును కనిపించగానే ఎంతో ధైర్యంతో దాన్ని పట్టుకుని దానికి ఎలాంటి హాని చేయకుండా నెహ్రూజువాలజికల్ పార్కుకు పంపించాడు. అంతే కాదు ప్రజలు ఎవరూ కూడా పాములను కొట్టకూడదని సందేశం ఇచ్చారు. పూర్తివివరాల్లోకెళితే ప్రతి రోజులాగే నగర కమిషనర్ అంజనీకుమార్ శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు వాకింగ్ కు వెళ్లాడు. సరదాగా అందరితో మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తున్న సమయంలో కమిషనర్ పెంపుడు కుక్క కారు వ‌ద్ద నిరంత‌రాయంగా మొరుగుతుంది. అది గమనించిన కమిషనర్ వెంటనే కారు పార్కింగ్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఉన్న చెట్ల పొద‌ల్లో ఉన్న ఓ పామును గ‌మ‌నించారు. వెంటనే ఆయన వెంట వచ్చిన కొంత మంది డిపార్ట్ మెంట్ వ్యక్తుల స‌హాయంతో పామును ప‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత పాముకి ఏం హాని తలపెట్టకుండా నెహ్రూ జూ పార్క్ కు త‌ర‌లించారు.

ఈ సందర్భంగా సీపీ అంజ‌నీ కుమార్ మాట్లాడుతూ పాముల‌ను చూసిన‌ప్పుడు ప్రజలు ఎవ్వరు భ‌య‌ప‌డ‌కూడ‌దని తెలిపారు. పామును చూసిన కంగారులో అది హాని తలపెడుతుందని చంప‌కూడ‌దు అని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ నగర పోలీసుల్లో కొంత మందికి పాములు ప‌ట్టే శిక్ష‌ణ ఇచ్చామ‌ని ఆయన తెలిపారు. అనేక సంద‌ర్భాల్లో వారు పాముల‌ను ప‌ట్టుకున్నార‌ని సీపీ గుర్తు చేశారు. ప‌ర్యావ‌ర‌ణంలో భాగ‌మైన మూగ జీవుల‌ను ఎప్పుడు కూడా చిత్రహింసలు చేయొద్దని వాటిని చంపొద్ద‌ని సూచించారు. పాముల‌ను ప‌ట్టుకుని జూకు త‌ర‌లించాల‌ని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories