హైదరాబాద్‌లో ఫిట్‌నెస్ దృష్టి పెట్టిన మహిళలు

హైదరాబాద్‌లో ఫిట్‌నెస్ దృష్టి పెట్టిన మహిళలు
x
Highlights

సినీతారల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారిన అంశం ఫిట్‌నెస్. అబ్బాయిలు సిక్స్ ప్యాక్ కోసం అమ్మాయిలు జీరోసైజ్ కోసం...

సినీతారల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారిన అంశం ఫిట్‌నెస్. అబ్బాయిలు సిక్స్ ప్యాక్ కోసం అమ్మాయిలు జీరోసైజ్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. యోగా, డ్యాన్స్‌లాంటి పలు ప్రక్రియల్ని సైతం ఫాలో అవుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో ఫిట్‌నెస్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఫేట్ నుంచి ఫిట్ గా మారేందుకు ఈ కాలం యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని కోసం అబ్బాయిలు కండలు పెంచుతుంటే అమ్మాయిలు నాజూకుగా కనిపించేందుకు తహతహలా డుతున్నారు. అందుకోసం యోగా సెంటర్‌లు, జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఫిట్‌నెస్ వర్కవుట్స్‌కి మ్యూజిక్‌ని జోడించడం, తదనుగుణమైన డ్యాన్స్ యాక్టివిటీలో భాగం కూడా ఫిట్‌నెస్‌లో పార్ట్‌గా మారింది. అందుకే యోగా, జిమ్, డ్యాన్స్ అన్ని కలగలిసిన ఫిట్‌నెస్ సెంటర్‌లు ఇప్పుడు నగరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు ఫిట్‌నెస్ మీద పెద్దగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించని మహిళలు అయితే ప్రస్తుతం వారిలో ఎవైర్నస్ పెరిగింది. జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తే ఫిట్ నెస్ తో పాటు ఆత్మ విశ్వాసం పెరుగుతుందని చాలారోగాలు నయం అవుతాయని రోజంతా ఉల్లాసంగా ఉంటుందని నమ్ముతుండటంతో మహిళలు ప్రస్తుతం దానిమీద ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ నగరంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా జిమ్ లకు వెళ్తున్నారు. వీరిలో 16 నుంచి 60 సంవత్సరాల వయస్సుగల ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక ఫిట్‌నెస్ సెంటర్లలో లేడీ ట్రైనర్లు ఉంటేనే మహిళలు ఎక్కువగా రావడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీనికోసం జిమ్ యజమానులు కూడా వారినే నియమిస్తున్నారు. ఇక ఒకప్పుడు కేవలం జిమ్ లో కసరత్తులు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఫిట్‌నెస్ వర్కవుట్స్‌కి మ్యూజిక్‌ని జోడించడం, తదనుగుణమైన డ్యాన్స్ యాక్టివిటీలో భాగం కూడా ఫిట్‌నెస్‌లో పార్ట్‌గా మారింది. అందుకే యోగా, జిమ్, డ్యాన్స్ అన్ని కలగలిసిన ఫిట్‌నెస్ సెంటర్‌లు ఇప్పుడు నగరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీజన్ తో ఏమాత్రం సంబంధం లేకుండా హైదరాబాద్ లో ప్రస్తుతం ఫిట్నెస్ సెంటర్లు ఎక్కువయ్యాయి. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం డబుల్ అయ్యాయి. దీని బట్టి చూస్తుంటే నగర వాసులు ఫిట్ నెస్ కోసం ఎంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories