Top
logo

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో తీపికబురును అందించింది. ప్రయాణికులను అతి తక్కువ కాలంలో తమ గమ్యస్ధానానికి...

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో తీపికబురును అందించింది. ప్రయాణికులను అతి తక్కువ కాలంలో తమ గమ్యస్ధానానికి చేర్చే మెట్రో మరో అడుగు ముందుకేసింది. అన్ని సౌకర్యాలతో పరుగులు తీస్తున్న మెట్రో ఇటీవల వైఫై ని కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఇదే దిశగా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రాత్రి పూట చివరి సర్వీస్‌లను కూడా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది.

ఇటీవల 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మెట్రో తన సర్వీసులకు పెంచింది. అయితే చివరి సర్వీస్‌ రాత్రి 11 గంటలకు ప్రారంభమై 11.50 గంటలకు గమ్య స్థానాన్ని చేరుకునేది. బస్సులు పున:ప్రారంభం కావడంతో ఈ సర్వీసులను రద్దు చేద్దామనుకున్న మెట్రో, ప్రయాణికుల సౌకర్యార్ధం కొనసాగించనుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. తిరిగి ఈ మెట్రో సర్వీసులు ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అవుతాయని ఆయన స్పష్టం చేసారు. ఆర్టీసీ సమ్మె కొసాగించిన కాలంలో ఈ సర్వీసు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యేదన్నారు.
Web TitleHyderabad Metro will run night services
Next Story