JBS-MGBS : పరుగులు తీయనున్న మెట్రో

JBS-MGBS : పరుగులు తీయనున్న మెట్రో
x
Highlights

పట్టణవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జెబిఎస్ నుండి ఎంజిబిఎస్ మెట్రో మార్గం డిసెంబర్ లో ప్రారంభం కానుంది.

పట్టణవాసులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తి కరంగా ఎదురు చూస్తున్న జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) వరకుగల మెట్రో మార్గం డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మార్గంలో ఉన్న 10 స్టేషన్లలో సివిల్, సిగ్నలింగ్, ఓవర్‌హెడ్ కేబులింగ్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్‌కు సంబంధించిన పనులు మొత్తం పూర్తయ్యాయని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు తెలిపారు. స్టేషన్లలో మిగిలిపోయిన పైకప్పు పనులు నవంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని డిసెంబర్ నుంచి ఈ మార్గంలో మెట్రో పరుగులు తీస్తుందని వారు తెలిపారు.

పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడ్‌పల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మరియు ఎంజీబీఎస్ గుండా వెళుతున్న మార్గం భారీగా రద్దీ ఉంటుందన్నారు. డిసెంబర్ లో ప్రారంభం కాబోయే JBS-MGBS మార్గం కారిడార్ 2 కిందకు వస్తుందని తెలిపారు. ఈ మార్గం మొత్తం 15 కి.మీ. దూరం ఉండగా వచ్చే నెలలో 9.6 కిలోమీటర్ల మెట్రో స్ట్రెచ్ ప్రారంభించడంతో, కారిడార్ 2 పూర్తవుతుందని తెలపారు. కారిడార్ 3 లో భాగమైన పరేడ్ గ్రౌండ్స్ స్టేషన్‌లో స్కైవాక్ కూడా నిర్మిస్తున్నారని తెలిపారు. ఐదు అంతస్తులతో నగరం మొత్తంలో ఎత్తైన మెట్రో స్టేషన్ గా జెబిఎస్ ఇంటర్‌చేంజ్ స్టేషన్ కానుంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories