మెట్రో నష్టాలు చెల్లించండి.. కేసీఆర్ ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ లేఖ!

మెట్రో నష్టాలు చెల్లించండి.. కేసీఆర్ ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ లేఖ!
x
Highlights

హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రలో లాక్ డౌన్ ముందువరకు ప్రజలకు తన సేవలను అందిస్తూ మంచి ఆదరనను పొందింది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను వారి గమ్య స్ధానాలకు చేర్చింది.

హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రలో లాక్ డౌన్ ముందువరకు ప్రజలకు తన సేవలను అందిస్తూ మంచి ఆదరనను పొందింది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను వారి గమ్య స్ధానాలకు చేర్చింది. దీంతో ప్రయాణికులందరూ మెట్రో ఛార్జీ కొంచెం ఎక్కువైనా దాన్ని ఎక్కడానికే సుముఖత వ్యక్తం చేశారు. దీంతో అతి తక్కువ కాలంలోనే మెట్రో రైళ్లు, మెట్రో ప్రాంగణం అంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయేవి. సరిగ్గా అదే సమయంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. దీంతో పరిస్థితి అంతా పూర్తిగా తలకిందులైంది. మూడు నెలలుగా మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి.

ఈ లాక్ డౌన్ కారణంగా మెట్రో రైళ్ళన్నీ స్టేషన్లకే పరిమితం అయ్యాయి. ఈ క్రమంలోనే హెచ్ఎంఆర్ఎల్ భారీగా నష్టాలను మూటగట్టుకోంది. మెట్రో రైళ్లు నడపటం ద్వారా ప్రతి నెలా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థకు రూ.45 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఈ ఏడాది జనవరి 1న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లను నడపడంతో ఏకంగా 4.60 లక్షల మంది మెట్రోలో ప్రయాణించడంతో ఒక్క రాత్రి లోనే ఎంతో ఆదాయం చేకూరింది. ఇక ఇప్పుడు మెట్రో రైళ్లు నిలిచిపోయినప్పటికీ స్టేషన్లు, డిపోలు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల కోసం సంస్థకు ఖర్చు చేయక తప్పడం లేదు.

ఇక ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేయగా కంపెనీ వారు ప్రతి ఏటా రూ.1300 కోట్లు వడ్డీలు కడుతున్నారు. మెట్రో సేవలు నిలిచిపోవడంతో పరిహారం చెల్లించాలని ఎల్ అండ్ టీ సంస్థ లేఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అంతే కాదు ప్రభుత్వం పరిహారం అందిచలేపోతే.. మూడు నెలలపాటు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వీలుగా మెట్రో నిర్వహణ ఒప్పందాన్ని మరో 4-6 నెలల పాటు పెంచాలని ఎల్ అండ్ టీ లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం నిర్మాణ వ్యయాన్ని ఎల్ అండ్ టీ సంస్థ దాదాపు 35 ఏళ్లపాటు ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు, వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ద్వారా సమకూర్చుకునే వీలుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories