తెలంగాణాలో మరో యజ్ఞం: కరోనా వైరస్ పై నేటి నుంచి ఇంటింటి సర్వే

తెలంగాణాలో మరో యజ్ఞం: కరోనా వైరస్ పై నేటి నుంచి ఇంటింటి సర్వే
x
telangana health minister etela rajender
Highlights

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా రాష్ట్రం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్రంగా ఈరోజు (మార్చి24, మంగళవారం) నుంచి ఇంటింటీ...

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా రాష్ట్రం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్రంగా ఈరోజు (మార్చి24, మంగళవారం) నుంచి ఇంటింటీ సర్వే నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కరోనా వ్యాధి విదేశాలనుంచి తిరిగి వచ్చిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని ఇంట్లో స్వీయ నిర్భంధం లో ఉండాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. అయితే, వారిలో చాల మంది ఈ సూచనను పాటించకుండా జన జీవితంలో స్వీచ్చగా తెరిగేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి వ్బారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఇటువంటి వారి లెక్కలు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో సుమారు 27 వేల మంది ఆశాలు, 8 వేల మంది ఏఎన్‌ఎంలు ఉన్నారు. వీరి ద్వారా ఇంటింటి సర్వే చేయనున్నారు. ఏఎన్‌ఎంల వద్ద ట్యాబ్‌లు ఉండడంతో.. వాటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ బృహత్తర ప్రక్రియలో 31 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇంటెలిజెన్సు విభాగం తోడ్పాటు అందించనుంది. స్థానికంగానే కరోనా (రెండో దశ వ్యాప్తి) సోకిన ఇద్దరు వ్యక్తులు నివసిస్తున్న సికింద్రాబాద్‌, కరీంనగర్‌లలో ఒక్కోచోట 150 బృందాలతో ఇప్పటికే ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

పబ్లిక్ హెల్త్ విభాగం డైరెక్టర్ డాక్టర్‌ జి.శ్రీనివాసరావుతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల ఉన్నతాధికారులు సోమవారం సమావేశమయ్యారు. వైద్య సిబ్బంది చేస్తున్న పరిశీలనకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఇప్పటికే నిఘా వర్గాలు సుమారు 18 వేల మంది సమాచారాన్ని సేకరించాయి.

రాష్ట్రంలో కరోనా అనుమానితుల సంఖ్య పెరిగితే వారిని విడి గదుల్లో ఉంచడానికి 130 ఐసోలేషన్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో సుమారు 32,500 పడకలు ఉన్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 1000 ఐసోలేషన్‌, 300 వరకూ వెంటిలేటర్ల పడకలు, ప్రైవేటు బోధనాసుపత్రుల్లో సుమారు 15 వేల పడకలు సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories