ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ
x
Highlights

వేతన చట్ట ప్రకారం వేతనాన్ని మినహాయించే అధికారం ఆర్టీసీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బుధవారం ఆర్టీసీ కార్మికుల వేతనాల చెల్లింపుపై నిర్వహించిన...

వేతన చట్ట ప్రకారం వేతనాన్ని మినహాయించే అధికారం ఆర్టీసీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బుధవారం ఆర్టీసీ కార్మికుల వేతనాల చెల్లింపుపై నిర్వహించిన విచారణలో భాగాంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ కార్మికులు ఒక్క రోజు పనికి హాజరు కాకపోయినా వారి 8 రోజుల వేతనం మినహాయించే అధికారం ఆర్టీసీ సంస్థకు ఉందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే కార్మికులు సెప్టెంబర్ నెలలో పని చేశారని, కనీసం ఆ వేతనాలనైనా చెల్లించాలని ఆర్టీసీ కార్మికుల తరుఫున న్యాయవాది కోర్టులో వాదించారు.

కార్మికులకు వారు పనిచేసిన రోజులకు సంబంధించిన వేతనాలు ఇవ్వవపోవడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా వెనకపడుతున్నారని, ఆర్థిక ఇబ్బంధులతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో స్పందించిన ఏజీ వేతనాలు రావాలంటే కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలన్నారు. హైకోర్టులో ఈ సమస్య జరగదన్నారు. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు వచ్చే బుధవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది. వచ్చే వారం కోర్టు ఏం తీర్పునిస్తుందో అని కార్మికసంఘాలు వేచిచూడాల్సిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories