Top
logo

మరో మూడు రోజులు భారీ వర్షాలు..

మరో మూడు రోజులు భారీ వర్షాలు..
Highlights

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతంలో సెప్టెంబరు 2న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో సెప్టెంబరు 2న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. కాగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారం భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నారు.


లైవ్ టీవి


Share it
Top