ఘనంగా రిటైల్ రత్నా అవార్డుల ప్రదానోత్సవం

ఘనంగా రిటైల్ రత్నా అవార్డుల ప్రదానోత్సవం
x
Harish Rao
Highlights

రిటైల్ రత్నా అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.

ది హన్స్ ఇండియా, హెచ్‌ఎంటీవీ సంయుక్తంగా రిటైల్ రత్నా అవార్డుల-2019 కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హాన్స్ ఇండియా, హెచ్‌ఎంటీవీ రిటైల్ రత్నా నిర్వహించడంపై హరీశ్ రావు అభినందనలు తెలిపారు.

అవార్డులకు ఎంపికలో యాజమాన్యం తీరు హర్షనీయమన్నారు. రిటైల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించే విధంగా అవార్డు కార్యక్రమాన్ని ఎంపిక చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా్ల్లో కూడా రిటైల్ ఇండస్ట్రీల్లో పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు పోటీ వచ్చినా వాటిని తట్టుకుని చిన్న కంపెనీలు నిలబడుతున్నాయంటే దానికి కారణం న్యాణత్య ప్రమాణాలు, సర్వీస్ కూడా ముఖ్యమన్నారు. ప్రస్తుత కాలం దేశంలో ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా మార్కెట్లు పడిపోయాయని అన్నారు. నేను ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్వహించిన సమావేశంలో వృద్ధి రేటు పెంచేందుకు చర్యలు తీసుకుంటుంన్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. కార్పొరేట్ ట్యాక్స్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ వృద్ధి రేటు 4.5 శాతం వద్ద ఉందని అయితే వృద్ధి రేటు పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై చర్చ జరిగినట్లు తెలిపారు.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగంలో విశాల్ ఫెరిపెరల్స్‌, హెల్త్‌కేర్ విభాగంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్‌‌ కు రిటైల్ రత్నా అవార్డులు దక్కాయి. హాస్పిటాలిటీ విభాగంలో హోటల్‌ బ్లిస్‌, హోమ్‌నీడ్స్ విభాగంలో రత్నదీప్ రిటైల్‌ ప్రతినిధులు అవార్డు అందుకున్నారు. అలాగే లైఫ్‌ స్టైల్‌ ఫ్యాషన్ విభాగంలో వైభవ్ జువెల్లర్స్‌, ఎమర్జెన్సీ రిటైలర్స్ తింబక్తు, కరీంనగర్ డెయిరీలకు స్పెషల్ అవార్డులు లభించాయి. నేషనల్ బ్రాండ్స్‌ విభాగంలో హోమ్‌ టౌన్‌, ఫారుచ్యూన్ ఇన్‌ ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories