2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్
x
Highlights

2020-21 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఒక లక్ష 82 వేల 914 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఒక లక్ష 82 వేల 914 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 40 వేల కోట్లు బడ్జెట్‌లో పెంచారు. రైతు సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, చేపడుతోన్న కార్యక్రమాలు, కేంద్రం నుంచి ఎంత నిధులు పెండింగ్‌లో ఉన్నాయో హరీష్ రావు తెలిపారు. మొత్తం ఒక లక్ష 82 వేల 914 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. దీనిలో రెవెన్యూ వ్యయం ఒక లక్ష 38 వేల 669 కోట్లు కాగా.. క్యాపిటల్ వ్యయం 22 వేల 61 కోట్ల రూపాయలుగా తెలిపారు.

ఇక మిగిలిన కేటాయింపులు చూస్తే.. రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు, రైతుబంధు పథకం కోసం రూ. 14 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ. 1,141 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ. 10,416 కోట్లు, సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు, రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు, ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు కేటాయించారు. బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు, విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు, పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కోసం రూ. 1000 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు, ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.

16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 9,771.27 కోట్లు కేటాయించినట్టు తెలపారు. ఇక సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ. 100 కోట్లు, వైద్య రంగానికి రూ. 6,186 కోట్లు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రూ. 4,356.82 కోట్లు, పశు పోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు, కల్యాణలక్ష్మి - బీసీల కోసం అదనపు నిధుల కింద రూ. 1,350 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు, మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ. 1,518.06 కోట్లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం రూ. 2,650 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ. 10,421 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723.27 కోట్లు కేటాయించారు.

ఇక పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కోసం రూ. 23,005 కోట్లు, పట్టణ మిషన్‌ భగీరథ పథకం కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు రూ.800 కోట్లు కేటాయించారు. మున్సిపల్‌ శాఖకు రూ. 14,809 కోట్లు, హైదరాబాద్‌ నగరంలో ప్రాజెక్టుల అమలు కోసం రూ. 10 వేల కోట్లు, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు, ఆర్టీసీకి రూ. 1000 కోట్లు, గృహ నిర్మాణాల కోసం రూ. 11,917 కోట్లు, పర్యావరణ, అటవీశాఖకు రూ. 791 కోట్లు, దేవాలయాల అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు, కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలకు రూ. 550 కోట్లు కేటాయించారు. అలాగే రోడ్లు, భవనాల శాఖకు రూ. 3,494 కోట్లు, పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ. 480 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories