కౌన్సిలర్లు పని చేయకపోతే వారిని తొలగిస్తాం: మంత్రి హరీశ్ రావు

కౌన్సిలర్లు పని చేయకపోతే వారిని తొలగిస్తాం: మంత్రి హరీశ్ రావు
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఈ రోజు ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఈ రోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డిలోని 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. 12 ఇళ్ల మీది నుంచి కరెంటు వైర్లు వెళుతున్నాయని స్థానికులు మంత్రికి చెప్పగా వెంటనే విద్యుత్ శాఖ అధికారులను పిలిచి సమస్య పరిష్కరించాలని తెలిపారు.

తమకు గ్యాస్ సిలిండర్లు లేవని కొందరు మహిళలు చెప్పడంతో ఆర్డీవోను పిలిచి అర్హులైన అందరికీ సిలండర్లు వచ్చేలా చూడాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మరికొంత మంది మహిళలు రేషన్ తమకు సరిగ్గా అందడం లేదంటూ ఫిర్యాదు చేయగా నెలలో పది రోజుల పాటు రేషన్ సరఫరా చేయాలని ఆ సమయాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి రెండు దశల్లో జరిగిందని తెలిపారు. అదే విధంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్ణణాల రూపు రేఖలు మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు.

కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు హక్కులను, బాధ్యతలను ఈ చట్టం ద్వారా సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. 75 గజాలలో ఇంటి నిర్మాణానికి 1 రూపాయి కట్టి దరఖాస్తు చేసుకోవచ్చని దానికోసం ఎలాంటి అనుమతులు అవసరం లేదని అన్నారు. నిబంధనలు విరుద్దంగా కడితే మాత్రం పెద్ద స్థాయిలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కోన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు అధికారం ఇచ్చిందని, కౌన్సిలర్లు పని చేయకపోతే వారిని తొలగించే అధికారం కలెక్టర్ కు ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా కౌన్సిలర్లు ఉదయమే వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories