హైదరాబాద్ పోలీసుల హ్యాకథాన్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

హైదరాబాద్ పోలీసుల హ్యాకథాన్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆన్ లైన్ మోసాలే ఎక్కువడా జరుగుతున్నాయి.

సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆన్ లైన్ మోసాలే ఎక్కువడా జరుగుతున్నాయి. వీటిపి తగ్గించడానికి పోలీసులు ఎప్పటి కప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ విద్యార్థులతో పోలీసులు హాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. 36 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, షీ టీమ్స్ అదనపు సీపీ శిఖ గోయల్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నగర కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో టెక్నికల్ హ్యకథాన్ కార్యక్రమం మొదటి సారి నిర్వహిస్తున్నామని చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో తాము వినూత్న ప్రయోగం చేస్తున్నామని ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. కొత్త ఆలోచనలు సృష్టించడంలో యువత ఎప్పుడూ ముందుండాలని, ఉంటుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత టెక్నాలజీ విషయంలో పోలీస్ శాఖకు ఎన్నో అవార్డులు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

నూతనంగా వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ అంతా మారిపోతుందన్నారు. నేరాన్ని కనుగొనడం మాత్రమే కాదు అది జరగకుండా చూసుకోవడం కూడా పోలీసుల లక్ష్యం అని తెలిపారు. ఇలాంటి కొత్త టెక్నాలజీల కోసం అన్వేషిస్తున్నామని, రాబోయే రెండు మూడు ఏళ‌్లలో టెక్నాలజీని తీసుకొస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థుల భాగస్వామ్యంతో కొత్త సాఫ్ట్‌వేర్స్, యాప్స్, రూపకల్పన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 60 కాలేజీలకు చెందిన విద్యార్థులు, 10 స్టార్టప్ కంపెనీలు, 5 ఎంఎన్‌సీలు, ముంబయి, బెంగళూరుకు ఐటీ నిపుణులు పాల్గొన్నారు. బెస్ట్ ఐడియా, యాప్స్ తయారు చేసిన వారికి రూ.లక్ష బహుమతి, సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి సిటీ పోలీసుల సహకారం ఉంటుందని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories