logo

తెలంగాణలో మరో రెండు జిల్లాలకు నోటిఫికేషన్‌

తెలంగాణలో మరో రెండు జిల్లాలకు నోటిఫికేషన్‌
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు ములుగు, నారాయణపేటను ఏర్పాటు చేసేలా ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు ములుగు, నారాయణపేటను ఏర్పాటు చేసేలా ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈమేరకు భూపాలపల్లి జిల్లాలోని ములుగు దాని రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న ములుగు, వెంకటాపూర్, మంగపేట్, వెంకటాపురం, తడ్వాల్, ఏటూరునాగారం, గోవిందరావ్‌పేట్, కన్నాయిగూడెం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో చేర్చారు.

అయితే నారాయణపేట్‌ జిల్లాలో ఉన్న మండలాల విషయంపై అధికారులు ఎటువంటి సమాచారం వెలువరించలేదు. ఈ నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి నెలరోజుల్లో భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్లకు ఎలాంటి సలహాలు, అభ్యంతరాలైనా తెలియజేయవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివిధ గ్రామాలు, మండల స్థాయిలో ఉన్న వారి అభ్యంతరాలు ఏవైనా ఉంటే వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే కొత్త జిల్లా ఏర్పాటును గెజిట్‌లో చేరుస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. కాగా ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 33కి పెరగనుంది.


లైవ్ టీవి


Share it
Top