CM KCR: బీజేపీపై పోరులో గేర్ మార్చిన కేసీఆర్.. అక్టోబర్ 5న సంచలన ప్రకటన ఖాయమా?

Groundwork begins for the launch of KCR’s national party on Dussehra
x

CM KCR: బీజేపీపై పోరులో గేర్ మార్చిన కేసీఆర్.. అక్టోబర్ 5న సంచలన ప్రకటన ఖాయమా?

Highlights

CM KCR: ప్యాన్ ఇండియా పార్టీకి సిద్ధమైన రంగం?

CM KCR: అక్టోబర్ 5.. విజయానికి ప్రతీకగా జరుపుకునే భారత అతిపెద్ద పండగ దసరా ఆరోజే. అయితే, అదేరోజు మరోచరిత్రకు సాక్ష్యం కాబోతోంది. ఇందుకు కారణం టీఆర్ఎస్ అధినేత పాన్ ఇండియా ఎంట్రీకి అదే అక్టోబర్ 5 వేదిక కావడమే. దేశం మొత్తం ఫెస్టివల్ మూడ్‌లో ఉన్న అదేరోజు ఎల్పీ భేటీతో మొదలు పెట్టి కంట్రీ పాలిటిక్స్‌పై అసలైన యాక్షన్‌లోకి కేసీఆర్ దిగిపోబోతున్నారనే వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే, అక్టోబర్ 5 కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వేయబోయే అడుగులు ఎలా ఉండబోతున్నాయి..? టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా..? లేక మరో కొత్త అస్త్రంతో కమలం, కాంగ్రెస్‌పై యుద్ధం మొదలు పెడతారా..? కంట్రీ పాలిటిక్స్‌పై

అక్టోబర్ 5 కేవలం దసరా మాత్రమే కాదు అంతకుమించిన పొలిటికల్ ఫెస్టివల్‌కు వేదిక కాబోతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అదేరోజు కంట్రీ పాలిటిక్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ గ్రాండ్‌ ఇవ్వబోతున్నారు. ఎల్పీ భేటీ, జాతీయ నేతలతో సమావేశం, జెండా, అజెండాపై క్లారిటీ.. ఇలా ప్యాన్ ఇండియా పొలిటికల్ ఎంట్రీపై క్లియర్ కట్‌ మెసేజ్‌ పంపించేందుకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయింది. అక్టోబర్ 5న జాతీయ పార్టీపై కేసీఆర్ యాక్షన్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ సైతం ఫిక్స్ అయిపోయినట్టు కనిపిస్తోంది. అయితే, బిహార్ సీఎం నితీశ్ ఓన్లీ మెయిన్ ఫ్రంట్ అంటున్న వేళ కంట్రీ పాలిటిక్స్‌పై కేసీఆర్ ఎలా ముందుకెళ్లబోతున్నారు..? బీజేపీ, కాంగ్రెస్‌ను కాదని ప్రత్యామ్నాయ పార్టీగా నిలవగలరా..? ఢిల్లీలో చక్రం తిప్పేందుకు గులాబీ దళపతి దగ్గరున్న అస్త్రాలేంటి..?

అక్టోబర్ 5.. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మరో జాతీయ ఆవిర్భావానికి వేదిక కాబోతున్న రోజుదే. దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్న వేళ అదేరోజు ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ఆ ఎల్పీ భేటీ అసలు అజెండా జాతీయ పార్టీపై తీర్మానం చేయడమే. టీఆర్ఎస్‌ను ఇక బీఆర్ఎస్‌గా అంటే భారతీయ రాష్ట్ర సమితిగా మార్చేందుకు తీర్మానం చేయొచ్చు. ఆ వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ భేటీ సారాంసం కూడా టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడమే. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 19 నిమిషాలకు జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే పలువురు జాతీయ నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. ఇదీ అక్టోబర్ 5 దసరా రోజు కంట్రీ పాలిటిక్స్‌ కోసం కేసీఆర్ కంప్లీట్ యాక్షన్. అయితే, జాతీయ పార్టీ ప్రకటన తర్వాత గులాబీ అధినేత మాస్టర్ స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి.?

నిజానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా రీసెంట్‌గా మాత్రం అంతకుమించిన యాక్షన్‌నే షురూ చేశారు. గత వారం రోజులుగా లోతైన కసరత్తు చేస్తున్న గులాబీ బాస్.. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటించేలా దళితులు, రైతులు, కార్మికులు, యువత అంశాలనే ప్రధాన అజెండాగా తొలి అడుగు ముందుకు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దేశమంతా తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమం తదితర నినాదంతో ముందుకు నడిచేలా కార్యాచరణ సైతం సిద్ధం చేసినట్టు టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. రైతులు, దళితులు, కార్మిక సంఘాలు, విశ్రాంత అధికారులతో చర్చల ద్వారా జాతీయ పార్టీ జెండా, అజెండాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో బీజేపీపై తీవ్ర అసంతృప్తి ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేని కారణంగా జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇదేసరైన టైంగా టీఆర్ఎస్ అధినేత గట్టిగా నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే ఇతరపార్టీలు ఇప్పటికిప్పుడు కలిసి రాకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా జతకలుస్తాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ముందుగా జాతీయ రాజకీయాలపై ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కి తామేు సమదూరమనే సంకేతం స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని పార్టీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్‌కు అనుకూల వైఖరితో ఉన్న నేపధ్యంలో.. ప్రస్తుతానికి వాటికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. జేడీఎస్ లాంటి కొన్ని పార్టీలు తమ వెంట కలిసి వస్తాయని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇటీవలే ట్వీట్ చేశారు. అయితే, జాతీయ రాజకీయాల్లో ఎలాంటి నినాదంతో కేసీఆర్ ముందుకెళతారు..?

తెలంగాణ మోడల్.. కంట్రీ పాలిటిక్స్‌ కోసం గులాబీ అధినేత ఎంచుకున్న బ్రహ్మాస్త్రం ఇదే. ఈ ఒకే ఒక్క నినాదంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వివరించడంతో రాష్ట్రంలో కాకుండా జాతీయస్థాయిలో రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని గులాబీ నేతల అంచనా. ఇటీవల ప్రగతిభవన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో రెండురోజుల పాటు చర్చలు జరిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ, నిరంతర విద్యుత్‌.. ఎందుకివ్వలేరని దేశవ్యాప్తంగా చర్చ జరపాలని రైతు నేతలను కేసీఆర్ కోరారు. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత ఉన్నా సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రంలో పాలించిన బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే రైతులకు కష్టాలు తప్పడం లేదని ప్రచారం చేసేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా దళితబంధు అమలుచేయాలని దళితులు డిమాండ్ చేసేలా ఉద్యమాలు చేపట్టాలని గులాబీ దళపతి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మతోందని కార్మికులు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని యువతను కదిలించాలని ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్ బృందం అధ్యయనం సైతం చేసింది.

ఇదే సమయంలో యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నఅంశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటీ వాటిపై బీజేపీతో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలపై అధ్యయనం చేసిన టీఆర్ఎస్.. వాటిపై స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌పై ఎక్కువగా స్పందించకుండా బీజేపీని కార్నర్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాలనేది కేసీఆర్ ప్రస్తుత వ్యూహంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

2014లో మోడీ ఎలా అయితే దేశవ్యాప్తంగా సభలు నిర్వహించారో అలాగే కేసీఆర్ కూడా ప్రతీ రాష్ట్రంలో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ కొత్త విమానం సైతం కొనేందుకు సిద్ధం అవుతున్నారనే వార్తలొస్తున్నాయి. 12 సీట్లుండే ఈ విమానం కోసం దాదాపు 80 కోట్లు వెచ్చించనున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. దీని కోసం భారీగా విరాళాలు ఇచ్చేందుకు గులాబీ నేతలు పోటీ పడుతున్నారట. అయితే, టీఆర్ఎస్ దగ్గర ప్రస్తుతం 865 కోట్ల నిధులు ఉన్నాయి. వీటిని జాతీయ స్థాయిలో సభలు, సమావేశాల కోసం ఉపయోగిస్తారనే చర్చ జరుగుతోంది. ఓవైపు బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ కంట్రీ పాలిటిక్స్‌పై కేసీఆర్ యాక్షన్‌లోకి దిగిపోయిన వేళ.. అవే జాతీయ పార్టీలు కేసీఆర్ ప్రకటనకు ముందే గేర్ మార్చేశాయి. నాలుగేళ్లుగా కేసీఆర్ జాతీయ పార్టీ, ఫ్రంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ విమర్శిస్తే.. కేసీఆర్ జాతీయ పార్టీ అజెండా బీజేపీకి లబ్ది చేకూర్చడమే అని కాంగ్రెస్ విమర్శించింది.

మొత్తంగా దసరా రోజున జాతీయ రాజకీయాలపై కేసీఆర్ నుంచి వచ్చే ప్రకటన దేశ రాజకీయ చరిత్రలోనే మరో అధ్యాయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అదేరోజు పార్టీ ప్రకటన తర్వాత తెలంగాణలో అమలవుతున్న దళితబంధు, రైతుబంధు, పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడంపైనా ఓ క్లారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories