Rythu Bandhu scheme: రైతులకు శుభవార్త ... రూ. 5,100 కోట్లు విడుదల

Rythu Bandhu scheme: రైతులకు శుభవార్త ... రూ. 5,100 కోట్లు విడుదల
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది. రైతులకు పెట్టుబడుల విషయంలో ఆర్థికంగా వెనుకడిన రైతులకు అండగా ఉండడానికి రైతుబంధు పథకం పెట్టుబడులను...

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది. రైతులకు పెట్టుబడుల విషయంలో ఆర్థికంగా వెనుకడిన రైతులకు అండగా ఉండడానికి రైతుబంధు పథకం పెట్టుబడులను రూ.5,100 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖకు ఉత్తర్వులు అందించడంతో నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. 2019–20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం రూ. 12,862 కోట్లు కేటాయించగా, ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రూ.5,100 కోట్లను రబీలో అందించేందుకు రంగం సిద్ధం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలుపారు. అంతే కాక రైతులకు చేయూతనిచ్చే రైతుబంధుకు నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories