తడి, పొడి చెత్తను ఒకే బుట్టలో వేయకూడదు: మంత్రి హరీష్ రావు

తడి, పొడి చెత్తను ఒకే బుట్టలో వేయకూడదు: మంత్రి హరీష్ రావు
x
Highlights

ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ది చేయడానికి గ్రామ ప్రగతి, అదే విధంగా పట్టణాలను అభివృద్ది చేయడానికి పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ది చేయడానికి గ్రామ ప్రగతి, అదే విధంగా పట్టణాలను అభివృద్ది చేయడానికి పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో పట్టణాలను, గ్రామాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలో తెలియజేసారు. అంతే కాదు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహణ కల్పించారు.

అదే విధంగా ఈ రోజు ఆర్థిక మంత్రి సిద్దిపేట ప్రజలకు పరిశుభ్రత గురించి, దాని ఆవశ్యకత గురించి, తడి, పొడి చెత్తలను ఏవిధంగా వేరు చేయాలనే విషయాల గురించి సూచించారు. సోమవారం ఉదయం ఆయన సిద్దిపేటలో మార్నింగ్‌వాక్‌ చేసి, ఆ తరువాత అలా అలా పట్టణంలోని పలు వార్డులను చుట్టారు. అంతే కాదు ప్రతి ఇంటికి వెలుతూ పరిశుభ్రత గురించి, చెత్త సేకరణ, వేరుచేయడం లాంటి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేరు వేరుగా ఉంచాలని తెలిపారు. ఆ తరువాత కాలనీలలో వచ్చే శానిటేషన్‌ సిబ్బందికి చెత్తను ఇవ్వాలని తెలిపారు. చెత్త జమ చేయడానికి ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి చెత్త బుట్టను ఇచ్చిందని, వాటిని సక్రమంగా వినియోగించాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తడి చెత్తను, పొడి చెత్తలను కలిపి ఒకే బుట్టలో వేయవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని, కాలనీలలో కూడా శుభ్రతను పాటించి, మొక్కలను నాటాలని తెలిపారు. ఈ కార్యక్రంలో మంత్రి హరీష్‌ రావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories