నుమాయిష్: మహిళలకు ప్రత్యేక ప్రవేశం..ఒక్కరోజు మాత్రమే

నుమాయిష్: మహిళలకు ప్రత్యేక ప్రవేశం..ఒక్కరోజు మాత్రమే
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా నాంపల్లిలో నుమాయిష్ ను నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా నాంపల్లిలో నుమాయిష్ ను నిర్వహిస్తున్నారు. 2020 జనవరి 1 వ తేదీన నుమాయిష్ ను హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే జైళ్ల నిర్వహణ, ఖైదీలకు సౌకర్యాలు, శిక్షణ వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగ్రామిగా నిలిచిందని అన్నారు. నాంపల్లిలో ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనలో రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది, ఐజీ సైదయ్య, చర్లపల్లి జైల్‌ సూపరింటెండెంట్‌ సంపత్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్‌ఐ ఆర్‌.కృష్ణ పాల్గొన్నారు.

ఈ నుమాయిష్ ప్రారంభమైన నాటి నుంచి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కన ఉన్న జిల్లాల నుంచి కూడా ఎంతో మంది నుమాయిష్‌ సందర్శించారు. దాదాపు 45 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని నలుమూలల నుంచి వివిధ రకాల వస్తువులను తీసుకొచ్చి విక్రయిస్తారు. 'కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు లభించే సుదరమైన బొమ్మలు, వస్తువులు, దుస్తులు ఇలా అన్ని విక్రయిస్తారు. దీంతో ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకుల తాకిడి అధికమైంది.

వాటితో పాటుగానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఆట వస్తువును ఏర్పాట్లు చేసారు. అంతే కాకుండా యువత ఎక్కువగా ఇష్టపడే జాయింట్ వీల్ లాంటివి కూడా ఈ నుమాయిష్ లో ఏర్పాటు చేసారు. దీంతో చిన్నపిల్లల నుంచి మొదలుకుని పెద్దవారి వరకు అందరూ ఇక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదే నేపథ‌్యంలో సోమవారం దాదాపు పది వేల మంది సందర్శకులు నుమాయిష్‌ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్లో మంగళవారంను ( 07.01.2020) మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. ఇందులో భాగంగా ఈ రోజు మహిళలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నారు. ఈ సందర్భంగా మైదానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories