ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు హైదరాబాద్ లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి...

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు హైదరాబాద్ లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్‌ పక్కన అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి కొద్దిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 20న

ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జైపాల్ రెడ్డి ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. జైపాల్ రెడ్డి మృతి వార్త తెలియగానే ఆయన బంధుమిత్రులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. పార్టీల నాయకులు తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. జైపాల్ రెడ్డి భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి జూబ్లిహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. రేపు ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్‌ పక్కన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే జైపాల్ రెడ్డికి స్మారక చిహ్నం కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories