నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత
x
Kavitha (File Photo)
Highlights

టీఆర్ ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

టీఆర్ ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగుతున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఆమె సమావేశం కానున్నారు. అలాగే నిజమాబాద్ టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో కవిత భేటీకానున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత కవిత పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె రీఎంట్రీపై పార్టీలో చర్చోపచర్చలు జరిగాయి. రాజ్యసభకు ఆమెను పంపిస్తారని ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో కవిత మద్దతుదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఇప్పుడు ఎమ్మెల్సీ నామినేషన్ ఎన్నికల్లో కవిత పేరు అనుహ్యంగా పైకి వచ్చింది. దీంతో ఆమె మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ తుది గడువు కాగా..ఒకరోజు ముందే కవిత నామినేషన్ వేయనున్నారు. కవిత ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు వేయడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఏప్రిల్ 7న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓట్లు వేస్తారు. టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల బలం అధికంగా వుండడంతో కవిత ఎన్నిక లాంఛనం కానుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ చేయకపోతే టీఆర్ ఎస్ అభ్యర్థిగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం వుంది.

గత పార్లమెంట్ లో ఎంపీగా వున్న కవిత జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఓడిన చోటు నుంచే ఆమె మళ్లీ తన రాజకీయ పునాది వేసుకుంటున్నారు. ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక అయిన తర్వాత రాష్ట్ర క్యాబినేట్ తీసుకుంటారనే ప్రచారం నడుస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories