Top
logo

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం
X
Highlights

సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న నిర్మల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో కెమికల్ పదార్థం పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో.. దట్టమైన పొగలు అలుముకున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story