నా ఓటు చెల్లకుండా పోయింది...

నా ఓటు చెల్లకుండా పోయింది...
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు బుధవారం ఎన్నికలను నిర్వహించిన విషయం అందరికీ...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు బుధవారం ఎన్నికలను నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోలింగ్ కొన్ని చోట్ల ప్రశాంతంగా జరిగినప్పటికీ, మరిచొన్ని చోట్ల మాత్రం చిన్న చిన్న గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌ మున్సిపాలిటీలోనూ ఓ సంఘటన చోటుచేసుకుంది.

పూర్తివివరాల్లోకెళితే రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్‌ పరిధి 20వ డివిజన్‌ లో ఐశ్వర్య నివసిస్తుంది. ఈమెకు తొలిసారి ఓటు రావడంతో తన కుటుంబీకులతో ఓటు వేసేందుకు బండ్లగూడ సరస్వతీ విద్యాలయంలోని పోలింగ్‌ బూత్‌కు చేరుకుంది. అందరికీ ఇస్తున్నట్టుగానే ఆమెకు కూడా పోలింగ్ అధికారులు బ్యాలెట్‌ పేపర్‌ను ఇచ్చారు. కానీ ఈ బ్యాలెట్‌పై అప్పటికే కారు గుర్తుపై సిరాతో ముద్ర వేసి ఉండడాన్ని గమనించింది. దీంతో ఐశ్వర్య ఓటు వేయడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రిసైడింగ్‌ అధికారికి విషయం తెలిపింది. అయినప్పటికీ ఆ అధికారి ఓ వృద్ధుడు పొరపాటున బ్యాలెట్‌ పేపర్‌పై వేలి ముద్ర వేశాడని సముదాయించి అదే బ్యాలెట్‌ పేపర్‌తో ఓటు వేయించారు.

అదే సమయానికి అక్కడికి జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌ నాయక్, బండ్లగూడ ఆర్వో కృష్ణమోహన్‌రెడ్డి రాగా తన ఓటు చెల్లకుండా పోయిందని, అన్యాయం జరిగిందని ఐశ్వర్య అధికారులకు ఆరోపించింది. దీంతో వారు ఆమెను సముదాయించి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. తాను వేసిన మొదటి ఓటు తప్పకుండా చెల్లుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories