మర్రిగూడెం మండలం కొట్టాలలో ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం

Etela Rajender: బీజేపీ అభ్యర్థికి అండగా మద్దతుగా నిలవాలని ఓటర్లకు అభ్యర్థన

Jyothi
Updated on: 15 Oct 2022 1:47 PM IST
Etela Rajender In By Election Campaign
X

మర్రిగూడెం మండలం కొట్టాలలో ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం

Etela Rajender: మూడు నెలల్లో కేసీఆర్ సర్కారు కూలిపోతుందని బీజేపీ నాయకులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ఆయన మర్రిగూడెం మండలం కొట్టాలలో బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. పెన్షన్లు రద్దుచేస్తామని బెదిరిస్తే భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. పెన్షన్, రైతు బంధు ఆపడం ఎవరితరం కాదన్నారు. జనం డబ్బులతో కేసీఆర్ విమానాలు కొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ నింపలేని నౌకర్లను, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిఖాళీని నింపుతామన్నారు.

Jyothi

Jyothi

Next Story